కోలుకుంటున్న రూపాయి

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనానికి ఎట్టకేలకు ఈవాళ బ్రేక్‌ పడింది. బుధవారం ఉదయం 20 పైసలు లాభంతో రూపాయి ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసల లాభంతో 58 రూపాయల 25 పైసల వద్ద ట్రేడవుతుంది. ఇతర ఆసియా కరెన్సీలు లాభపడటంతో మన రూపాయి కూడా కాస్త తేరుకుంది. ఈవాళ ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల కానున్నాయి. ఈ గణాంకాలు రూపాయిపై ప్రభావంచూపుతాయని భావిస్తున్నారు.
ఎగుమతిదారులు… తమ వద్ద ఉన్న డాలర్లను అమ్మాలని రిజర్వ్‌ బ్యాంకు సూచించింది. ఎగుమతి చేసే కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా విదుశాల నుంచి దేశంలోకి తీసుకువచ్చే డాలర్ల పరిమితిని ఆర్‌బీఐ పెంచింది. ఈ చర్యలు రూపాయి కొంత కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు.