కోళ్తఫారంలో అగ్ని ప్రమాదం

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల మేర  ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు తెలిపాడు. ఘటనాస్థలికి అగ్నిమాపక శకటం చేరుకోవడంలో ఆలస్యమవడంతో కోళ్లఫారం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శకటం దారిలో బురదగుంటలో చిక్కుకుపోవడంతో సమయానికి చేరుకోలేకపోయింది, ఈ సమాచారాన్ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారికి సిబ్బంది చేరవేశారు. వాహనాన్ని  జేసీబీ సాయంతో బయటికి తీయాలని ఉన్నతాధికారి ఆదేశించడంతో సిబ్బంది, గ్రామస్థులు నాలుగు గంటల పాటు శ్రమించి వాహనాన్ని బయటికి లాగారు. అనంతరం గ్రామానికి వాహనం చేరేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.