కోహ్లీకి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఎంపిక
ఈనెల 12న బెంగళూరులో అవార్డుల ప్రధానోత్సవం
వెల్లడించిన బీసీసీఐ అధికారులు
ముంబయి, జూన్7(జనం సాక్షి) : భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి చేరింది. 2016ా17, 2017ా18 సీజన్లలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బెస్ట్ అంతర్జాతీయ ఆటగాడికి ఇచ్చే పాలి ఉవ్రిూగర్ అవార్డును భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దక్కించుకున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ అవార్డు కింద కోహ్లీ రూ.30 లక్షలు (ఏడాదికి రూ.15 లక్షల చొప్పున) అందుకోనున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు వయస్సుతో సంబంధం లేకుండా అవార్డులకు ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. జూన్ 12న బెంగళూరులో ఈ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం జరగనుంది.
016ా17, 2017ా18 సీజన్లలో మహిళల క్రికెట్లో బాగా రాణించినందుకుగాను హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందజేయనున్నారు. వీరిద్దరు కూడా తలో రూ.15 లక్షల చెక్‌ను అందుకోనున్నారు.
అవార్డులు దక్కించుకున్న మరికొంత మంది ఆటగాళ్ల వివరాలు చూద్దాం.
2016ా17 సీజన్:
కృనాల్ పాండ్యా లాలా అమర్‌నాథ్ అవార్డు(దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించినందుకు)
పర్వీజ్ రసూల్(జఝ్ము కశ్మీర్) ా లాలా అమర్‌నాథ్ అవార్డు(రంజీ ట్రోఫీలో ఆల్‌రౌండర్‌గా రాణించినందుకు)
ఠాకూర్ తిలక్ (హైదరాబాద్) ా జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్‌ా16 విజయ్ మర్చంట్ టోర్నీలో అత్యధిక స్కోరు)
ా పూనమ్ రౌత్ ా జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ
2017ా18 సీజన్:
మయాంక్ అగర్వాల్ ా మాధవరావు సింథియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు)
ఆర్యమన్ బిర్లా(కుమార మంగళం బిర్లా తనయుడు) ా ఎమ్‌ఎ చిదంబరం ట్రోఫీ
కె. నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధప్రదేశ్) ా జగన్మోహన్ దాల్మియా ట్రోపీ
మొత్తం కొత్తం 18 విభాగాల్లో బీసీసీఐ అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ మాట్లాడుతూ.. ఈ రెండేళ్లల్లో అటు పురుషులు.. ఇటు మహిళల క్రికెట్లో భారత్ అద్భుతంగా రాణించింది. క్రికెటర్లు సాధించిన విజయాలకు మేము ఎంతో గర్వపడుతున్నాం’ అని అన్నారు. అనంతరం పాలకుల కమిటీలోని సభ్యురాలు డయానా ఎడుల్జి మాట్లాడుతూ…’గత రెండేళ్లకు సంబంధించిన అవార్డలను ఒకేసారి ప్రకటించాం. అఫ్గాన్‌తో చరిత్రాత్మక టెస్టుకు ముందు భారత క్రికెట్లో ఇదో పెద్ద పండుగ. మొదటిసారి మహిళల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ కేటగిరీని ప్రవేశపెట్టాం. చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.