కోహ్లీ ఒక సూపర్ స్టార్

కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అతని బ్యాటింగ్ తీరుకు దిగ్గజ ఆటగాళ్ల నుంచి ప్రత్యర్ధి జట్టు సభ్యుల 8sponz2వరకు అంతా మెచ్చుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ అజేయంగా 235 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. అయితే తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బ్రాండన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ.. కోహ్లీ ఒక మహా సూపర్ స్టార్ అని, అతన్ని కలిగి ఉండటం క్రికెట్ అదృష్టమని వ్యాఖ్యానించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మెక్‌కల్లమ్ బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీపై స్పందించాడు. అతనొక అసామాన్యమైన వ్యక్తని, నిలకడగా ఆడుతూ నిరంతరం పోటీలోనే ఉంటున్నాడని చెప్పాడు. వన్డే, టెస్ట్, టీ20లో అతని ప్రభావం బాగా ఉందని అన్నాడు. కోహ్లీ ఈ ఏడాదిలో మూడు టెస్ట్ డబుల్ సెంచరీలు చేసి మెక్‌కల్లమ్, బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్‌ల రికార్డ్‌ను సమం చేశాడు.