క్యూలో నిరీక్షిస్తే తప్పేంటి- సెహ్వాగ్

ఎప్పుడూ ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందిస్తూ ప్రత్యేకతను చాటుకునే మన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్ననిర్ణయాన్ని స్వాగతించాడు. భారత్ లో నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ తీసుకున్న నిర్ణయం చాలా సాహాసోపేతమైనదని పేర్కొన్న cl_virupa.. మన దేశాన్ని రక్షించడం కోసం ప్రజలు కొన్ని గంటలు పాటు క్యూలో నిరీక్షిస్తే తప్పేంటని ప్రశ్నించాడు.మనదేశాన్ని రక్షించడం కోసం  హనుమంతప్ప అనే జవాను ఆరో రోజుల పాటు 35 అడుగుల లోతులో 45 సెంటీగ్రేడ్ల చలిలో ఉంటే, మనం ఇప్పుడు కొన్ని గంటల పాటు క్యూలో ఉంటే ఎటువంటి నష్టంలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.