క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ డిపార్ట్మెంట్

ఆరోగ్య పరిరక్షణ ఫిజికల్ ఫిట్నెస్ గురించి వీక్లీ పెరేడ్.
 – అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్
సిద్దిపేట బ్యూరో 16, జూలై ( జనం సాక్షి )
పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శనివారం రోజున సిద్దిపేట పెద్ద కోడూర్ గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో  జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్  సిబ్బందికి  వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహేందర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్    ప్రదర్శనను మరియు నీట్ డ్రెస్ అవుట్ ను  పరిశీలించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని,  సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.  ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు ,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు  అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. మరియు రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.మరియు సమయం దొరికినప్పుడు భార్యా పిల్లలతో ఉల్లాసంగా గడపాలని సూచించారు. మరియు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, వన్ టౌన్ సిఐ బిక్షపతి, టూటౌన్ సీఐ రవికుమార్, త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్, రూరల్ సీఐ జానకి రామ్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదా, ఆర్ఎస్ఐలు కార్తీక్, వెంకటరమణ, మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.