క్రీడల తో మానసిక ఉల్లాసం

జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలు

వేములవాడ ఆగస్టు 29 (జనంసాక్షి)
భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్ చాంద్ జయంతి ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వేములవాడ లో జాతీయ క్రీడ దినోత్సవం ను కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి, సుహాసిని మాట్లాడుతు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం జరుగుతుంది అని, ప్రతి విద్యార్ధి చదువు తొ పాటు, ఆటలలో నైపుణ్యం సాధించాలి అని పేర్కొన్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నాంపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్యాన్ చాంద్ జీవిత విశేషాల ను కళ్ళకు కట్టినట్లు వివరించారు.ధ్యాన్ చాంద్ జీవితం క్రీడాకారులందరికి ఆదర్శ ప్రాయం అని అన్నారు,అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.అలాగే తెలుగు దినోత్సవం ను కూడా ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది వ్యాయామ ఉపాధ్యాయులను, తెలుగు భాష ఉపాధ్యాయుల ను సన్మానించారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం జయశ్రీ, జయంత్ శర్మ, యాదగిరి, బొజ్జ కృష్ణ, హరి కృష్ణ, నర్మదా, మాదవి, రాధికా, సరోజ, సరళ, సవిత, సావిత్రి పాల్గొన్నారు..