క్రీడాకారులకు అండగా ఉంటాం.

– బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు.
పోటో : షూస్ పంపిణీ చేసిన సిఐ బాబురావు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6, (జనంసాక్షి)
క్రీడాకారులకు అండగా ఉంటానని బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో తాళ్ల గురిజాల పోలీసు స్టేషన్ పరిధిలోని జ్యోతి బాపులే స్కూల్ విద్యార్థులకు షూస్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు క్రీడలలో నైపుణ్యం ప్రదర్శించడంలో ముందున్నప్పటికి ఆర్థిక పరిస్థితులు బాగలేక షూస్ లేకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న 15 మంది గుర్తించి షూస్ అందజేసినట్లు ఆయన వివరించారు. క్రీడాకారులకు ఆర్థిక పరిస్థితులు అడ్డుకాకూడదని, యువత చదువుతో పాటు క్రీడల్లో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. క్రీడల్లో రాణించే యువతకు తమ వంతు సహాయం అందించడానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ఈకార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్సై రాజశేఖర్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై ఆంజనేయులు, నెన్నెల ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు