క్వార్టర్ ఫైనల్లో పి.వి.సింధు

భా49432713రత స్టార్ క్రీడాకారిణి  పి.వి.సింధు చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సింధు 18-21, 22-20, 21-17తో బెవెన్ జంగ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్ ఆరంభంలో సింధు ఒక దశలో 11-7తో ఆధిక్యంలో నిలిచింది. అరుుతే అమెరికన్ ప్రత్యర్థి వరుసగా పారుుంట్లు సాధించి 13-13తో స్కోరును సమం చేసింది. అదే జోరుతో ఆమె 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా పారుుంట్లు సాధించి గేమ్‌ను గెలుచుకుంది. మొదట 8-0తో ఆధిక్యం పొందినప్పటికీ తర్వాత జంగ్… సింధుకు అవకాశమివ్వకుండా రెచ్చిపోరుుంది. 16-16తో స్కోరును సమం చేసి అనంతరం 19-17తో ఆధిక్యంలోకి వచ్చింది. అరుుతే సింధు ఐదు పారుుంట్లు సాధించి గేమ్‌ను కై వసం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ బెవెన్ జంగ్ పట్టుదలను ప్రదర్శించినప్పటికీ సింధు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించింది.