క్షమాభిక్ష ప్రసాదించండి రాష్ట్రపతికి కసబ్ విజ్ఞప్తి
ముంబై, సెప్టెంబర్ 18(జనంసాక్షి):
పాకిస్తాన్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్ ఆవిూర్ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆయన పిటిషన్‌ను సర్ ఆర్థర్ జైలు అధికారులు మంగళ వారం రాష్ట్రపతి భవన్‌కు పంపించారు. ఉరిశిక్షను రద్దు చేయాలంటూ కసబ్ పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గత నెల తిరస్కరించింది. దీంతో ఆయన క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నారు.2008 నవంబర్
26న కసబ్ సహా మరో తొమ్మిది ముష్కరులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ¬మం సృష్టించారు. ఈ దాడుల్లో 166 మంది అసువులు బాశారు. భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని కాల్చి చంపాయి. కసబ్ ఒక్కడే పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సజీవంగా పట్టుబడ్డాడు. ఉగ్రదాడి అనంతరం కేసు విచారించిన ట్రయల్ కోర్టు కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ.. కసబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా చుక్కెదురైంది. గత నెల 14న తేదీన కసబ్ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. కింది కోర్టు మరణశిక్ష విధించడాన్ని సమర్థించింది. భారత్‌పైకి దండెత్తడం, దాడికి తెగబడడం కసబ్ చేసిన పెద్ద తప్పని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పేర్కొంది. కసబ్‌కు మరణ శిక్ష మరో శిక్ష లేదని వ్యాఖ్యానించింది. ఎంతో మందిని హతమార్చిన ఉగ్రవాదికి ఉరే సరి అని తెలిపింది. ‘భారత్‌పైకి దండెత్తడం కసబ్ చేసిన పెద్ద తప్పు. అతడికి మరణ శిక్ష తప్ప మరో శిక్ష లేదు. అతడు స్పృహలో ఉండే వాంగ్మూలం ఇచ్చినట్లు మేం పరిగణిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడంతో న్యాయపోరాటం చేసేందుకు కసబ్‌కు దారులు మూసుకుపోయాయి. ఇక రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడమే మిగలడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న కసబ్.. ఈ మేరకు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నాడు. సర్ అర్ధర్ జైలులో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జైలు అధికారులు రాష్ట్రపతి భవన్‌కు పంపించారు.