గడీలో ఊరడమ్మ దేవాలయం లో ఘనంగా బోనాలు

 

జహీరాబాద్ జులై 17 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణం గడీలో ఊరడమ్మ దేవాలయం లో ఘనంగా బోనాలు పండుగను నిర్వహించారు. ఈ వేడుకల్లో నిర్వహించిన ఆషాడ బోనాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజీ మంత్రి గీతారెడ్డి, సామాజిక ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్, టి పీసీసీ నాయకులు నరోత్తం, ఐటి సేల్ చైర్మన్ మదన్ మోహన్ కు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు బాజాభజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు.