*గణనాథుని నవరాత్రుల ఉత్సవాల లో భాగంగా దుర్గసేన ఆధ్వర్యంలో కుంకుమ పూజలు*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 09 (జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఆదర్శనగర్ లో గల దుర్గా సేన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, గణనాథుని నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని , మహిళ మణులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు ,పురోహితులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గణేశునికి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం గణనాథుడు పూజలు అందుకొని, శుక్రవారం రోజున మహిళా మణులచే కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆ గణేశుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని వేద పండితులు వెంకటేశ్వర్లు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం దుర్గా సేన గణేష్ ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు రవితేజ రాజ్ కుమార్ ఇక్బాల్ అనిల్ అరుణ్ నరసింహారాజు లితేష్ మరియు గణేష్ తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ ని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అదే విధంగా రేపు గణనాథుని నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగునని ఈ సందర్భంగా దుర్గ సేన గణేష్ ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు తెలియజేశారు