గణేష్ నగర్ లో ఘనంగా వినాయక పూజలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 03(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని గణేష్ నగర్ లో శనివారం వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక వినాయకుని విగ్రహం వద్ద భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల నైవేద్యాలు పెట్టి ప్రార్థించారు. అలాగే స్థానిక వినాయక మండప నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. వినాయకుడు అందరి కోరికలు తీర్చి సుఖ సంతోషాలతో ఉంచాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జి. గోవర్ధన్, జి. భాస్కర్, పి. రమేష్ తేజ, అరుణ, సాన్విక, సాయి ప్రీతిక, విజయ లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.