గణేష్ నిమజ్జనం, మొహరం పండుగలపై సమీక్ష
హైదరాబాద్ : నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అంజనీ కుమార్ చర్చించి దిశానిర్దేశం చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. నగర ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.