గవర్నర్‌కు ఘనస్వాగతం

గన్నవరం: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎ.పి.సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయంస్పైస్‌ జెట్‌లో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా  కలెక్టర్‌ బుద్ధ ప్రకాశ్‌ ఎం. జ్యోతి స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గవర్నర్‌ ప్రభుత్వ అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయానికి  వెళతారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ సూర్యప్రకాశ్‌రావు, జేపీ ఉషాకుమారి, ఎస్పీ విజయ లక్ష్మి, సీపీ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు డైరెక్టర్‌ కె. నాగభూషణం తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.