గాంధీజి ఆశయాలను కొనసాగించాలి – కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు

గాంధీజి ఆశయాలను కొనసాగించాలి – కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సింగరేణి టాగూర్ స్టేడియం సమీపంలో గల గాంధీ విగ్రహానికి సోమవారం చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కొరకు, బ్రిటిష్ సామ్రాజ్యం నుండి దేశ ప్రజల రక్షణ కొరకు మహాత్మా గాంధీ ఏదైతే శాంతి మార్గాన్ని అనుసరించడం జరిగిందో అదే శాంతి మార్గాలను అనుసరించాలని సూచించారు. నేడు తెలంగాణ రాష్ట్రం లో ప్రజలను బానిసలా చూస్తూ రాక్షస పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించుకొడానికి ప్రజలు సిద్దం కావాలని పిలపునిచ్చారు. ఆదివారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేటిఆర్ పిట్ట కథలు చెప్తూ ఇక్కడ ప్రజలను మోసం చేసి ఓట్లు సీట్లు దండుకోవాలని చూస్తున్నాడని, అలాంటి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం యువత ప్రాణాలు అర్పిస్తే అలాంటి యువత భవిషత్ ను దృష్టిలో పెట్టుకొని ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారిని మధ్యంకు బానిసలు చేసే విధంగా గల్లికో బెల్ట్ షాపును నడుపుతూ ప్రభుత్వ ఖజానా నిపుకుంటుందని మండిపడ్డారు. దేశంలో రైతు సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని, రైతులనే కాకుండా రైతు కూలీలు సంక్షేమానికి అనేక పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభత్వానికి వుందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ గత 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని, దళిత ముఖ్యమంత్రి హామీ ఏమయిందని, దళితులకు మూడు ఎకరాల భూమి ఎప్పుడు పంపిణీ చేస్తారని, చెన్నూర్ రెవేన్యూ డివిజన్ గా ఎప్పుడు మారుస్తున్నారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో ,టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి లక్ష్మణ్, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ తేజావత్ రాంబాబు, కాంగ్రెస్ టౌన్ జనరల్ సెక్రెటరీ కొట్టే రాజన్న, బీసీ సెల్ అధ్యక్షుడు మంతు రవి, ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ బత్తుల వేణు , ఐ ఎన్ టి యు సి నాయకులు చెంద్రగిరి ఏల్లయ్య , ఆకుల రాజన్న, యూత్ కాంగ్రెస్ నాయకుడు పల్లె దినేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.