గాంధీ భవన్ లో తెలుగు పాండిత్ ల ఆందోళన
హైదరాబాద్,ఆగస్ట్26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం లో తెలుగు బాషా సాహిత్యలను 8సంవత్సరాలు గా శిక్షణ పొందిన తెలుగు పండితుల అభ్యర్థులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని గాంధీ భవన్ లో ఆందోళనకు దిగిన టీపీటీ అభ్యర్థులు.గాంధీ భవన్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన అభ్యర్థులు. తెలుగు బాషా ను తప్పనిసరిగా చేస్తూ రెండు రాష్ట్రాలు సంస్కృత బాషా ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.తెలుగు బాషా అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణ లో 25వేల మంది తెలుగు పండిట్ (టీపీటీ ) లో శిక్షణ తీసుకొని ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేసారు.ఏపిలో టీపీటీ చేసిన వారికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి అక్కడి ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు అన్నారు.8సంవత్సరాలు గా తెలుగు పండిట్ చదివినవారికి అవకాశం కల్పించకుండా బీఈడ్ లో తెలుగు మెథడాలజీ తీసుకున్న వారికి జేఎల్ నియామకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని టీపీటీ చదివిన వారికీ అవకాశం కల్పించకపోవడం వేలాది మంది అభ్యర్థులు రోడ్డు మీద పడ్డారని వారు తెలిపారు.మైనారిటీ గురుకుల ఔటసోరసింగ్ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లకు ఈనెల 23న నిర్వహించిన్న ఎంపిక ను రద్దు చేసి టీపీటీ అభ్యర్థులను అర్హులు గా ప్రకటించి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందిగా గా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.