గాజువాక ఘటనలో మరో నలుగురు మృతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి ): నాటు సారాగా భావించి ప్లాస్టిక్‌ డబ్బాలోని ద్రావకం తాగిన ఘటనలో ఇవాళ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. గాజువాక ఎస్టీ కాలనీలో ద్రావకం తాగి నిన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరో నలుగురు మృతి చెందారు. ఆస్పత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
విశాఖ జిల్లా గాజువాకలోని స్వతంత్రనగర్‌ సవిూపంలోని ఎస్టీ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పందుల పెంపకం, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే పలు కుటుంబాలు ఇక్కడి ఎస్టీ కాలనీలో ఉంటున్నాయి. శనివారం సాయంత్రం నడుపూరు గెడ్డవద్ద పెండ్ర అప్పలమ్మ(65) చిత్తు కాగితాలు ఏరుతుండగా తుప్పల్లో 10 లీటర్ల ఎ/-లాస్టిక్‌ క్యాన్‌ దొరకడంతో ఆమె ఇంటికి తీసుకొచ్చింది. అందులో ఉన్న ద్రావకాన్ని నాటుసారాగా భావించి కొంచెం తాగింది. అనంతరం పక్క వీధిలో ఉంటున్న ఆసనాల కొండోడు(64), వాడపల్లి అప్పడు(48) కూడా తలో గ్లాసు తాగారు. స్థానికంగా మరో పది మందికి దాన్ని పంచారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన అప్పలమ్మ, ఆసనాల కొండోడు, వాడపల్లి అప్పడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.