గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్

గిరిజన ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యకులు అంగోత్ భద్రయ్య.

జనం సాక్షి, చెన్నరావు పేట

రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘము తరఫున
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యకులు అంగోత్ భద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన రిజర్వే షన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధ రాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపిందని అన్నారు.రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధ రాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, ఈడబ్ల్యూఎస్‌ 10 కు మొత్తం 64శాతం రిజర్వేషన్ల అమలు చేస్తారని అన్నారు. ఈ
సమావేశం లో వీరన్న,రవి,భద్రు ,రమేష్ ,స్వామి,బాలు ,నర్సయ్య ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.