గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి – సండ్రగిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి – సండ్ర
పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యేసండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. పెనుబల్లి మండలం, వియం బంజర్ లోబుదవారం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సండ్ర పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజ లి ఘటించి నివాళులర్పించారు, ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎంతో ధైర్యం , తెగువ ఉన్న గిరిజన జాతి అడవికే పరిమితమైందని, తండాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తు వస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంజరిగిందన్నారు, గిరిజనులను సర్పంచ్ లుగా, నాయకులుగా ఎదిగేలా తోడ్పాటును అందించామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు పడేవారని అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్ సౌకర్యంతో పాటు, మిషన్ భగీరథ తాగునీరు, తాండలకు బి. టి. రహదారులు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, మండలపార్టి అద్యక్షలు కనాగాల వెంకటరావు,చేక్కిలాల లక్ష్మా రావు, లక్కినేని వినీల్, ముక్కేర భూపాల్ రెడ్డి, మంగు నాయక్ ,భూక్యా ప్రసాద్, తావు నాయక్,తదితరులు పాల్గొన్నారు.