గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి

.గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి.ఘనంగా కామ్రేడ్ ధర్మ బిక్షం 101 జయంతి వేడుకలు.
కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ల సంఘం కోటగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున మండల కేంద్రంలో గీతా కార్మికుల కుటుంబాల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మ బిక్షం 101 జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌడ కులస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గీత పనివార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మాట్లాడుతూ..కామ్రేడ్ ధర్మ బిక్షం చివరి శ్వాస దాకా గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యుడని కొనియాడారు.ఆయన రెండుసార్లు శాసన సభ్యులుగా,మూడుసార్లు పార్లమెంటరీ సభ్యులుగా కొనసాగిన మహానీయుడని అన్నారు.దున్నేవారికి భూమితో పాటు గీసే వారికి చెట్టు నినాదంతో గీత కార్మికుల లోకాన్ని ఉద్యమ బాటలో నడిపించిన మహనీయుడని అన్నారు.గౌడ కులస్తుల పిల్లల కోసం హైదరాబాదు నగరంలో గౌడ్ హాస్టల్ ని నిర్మించిన మహనీయుడని తెలిపారు.గీతా కార్మికులకు సహకార సంఘాలు నెలకొల్పాలని మొట్టమొదటిసారిగా ఉద్యమాలు మొదలుపెట్టిన నాయకుడని తెలిపారు.గీతా కార్మికు నెలవారీ వృద్ధ పెన్షన్ వన పెంపకానికి ప్రతి సొసైటీ 5 ఎకరాల భూమిని ఆయన పోరాట ఫలితమే ఈరోజు అనుభవిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బి వెంకట్,ప్రధాన కార్యదర్శి శ్రీధర్,సహాయ కార్యదర్శి పండరి,ఎస్ సాయి కృష్ణ, గంగా,గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ గంగా ప్రసాద్,టి సుధాకర్,సాయ,గీతా కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.