గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులకు సంఘీభావం తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 25 కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్ ఉండి గుడిసెలు వేసుకొని ఉంటున్న లబ్ధిదారులకు సంఘీభావంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు కందికొండ గీత గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఉండి గుడిసలేసుకున్నావారందరికి ప్రభుత్వ అధికారులు హద్దులు చూపించే వరకు పోరాటాన్ని సంఘటితంగా కొనసాగించాలని అన్నారు.
ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న లబ్ధిదారులకు 5వ సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు పూర్తిగాస్తుందని హామీ ఇచ్చారు.
జిల్లా అధికార యంత్రాంగం తో కూడా మాట్లాడి సాధ్యమైనంత త్వరలో సర్వే నిర్వహించి ప్లాట్లకు హద్దులు చూపించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఆమె వెంట సిఐటియు జిల్లా నాయకులు అశోక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నరసింహ, స్థానిక ప్రజా సంఘాల నాయకులు బలమోని శ్రీను, షాగాది నిరంజన్, పి రామచంద్రి, ఉడుత నిరంజన్, ఎత్తం గ్రామ మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Attachments area