గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో వరుసగా చోటుచేసుకున్న సంఘటనలపై కళాశాల విద్యార్థులు స్థానిక నాయకులతో కలిసి మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకురావడంతో గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులు ఎన్ ఎస్ యూఐ విద్యార్థి విభాగం శ్రేణులతో కలిసి కళాశాలలో సందర్శించడం జరిగింది,మొన్న అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన నిన్న విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై జరిగిన సంఘటన వివరాలను కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా విద్యార్థుల పట్ల గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వహించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ప్రతిరోజు గురునానక్ కళాశాల కి సంబంధించి అనేక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. నిన్న జరిగిన సంఘటనపై స్థానిక పోలీసు అధికారులు మరియు యాజమాన్యం విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.ఇట్టి కళాశాలకు స్థానిక అధికార యంత్రాంగం..స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారుల ప్రోత్సాహం వల్లే సంఘటనలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తెరాస ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని..పేద విద్యార్థులు చదువుకొనలేక డొనేషన్లు కట్టలేక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు..ఇట్టి సంఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని లేనిపక్షంలో త్వరలో పెద్ద ఎత్తున విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్స్ ఈర్లపల్లి సునీత వెంకట్ రెడ్డి, ఆకుల మమత ఆనంద్, పంది శంకరయ్య, నరాల విశాల సాగర్, మోహన్ నాయక్, యాచారం వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వరికుప్పల సుధాకర్ ,కొండ్రు ప్రవీణ్ కుమార్, ప్రశాంత్ కుమార్, పెద్ది గారి శ్రీకాంత్ ,సొప్పరి రవికుమార్, బి నందకిషోర్,ఇమ్రాన్, సికిందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు