గెలుపు కై పోరాటం చేయాలి : డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 18( జనం సాక్షి ) జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14,16 ,18,20 సంవత్సరాల బాలబాలికలకు క్రీడా పోటీలకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గెలుపు ఓటములను సభావంతో స్వీకరించి గెలుపుకై పోరాటం చేయాలని అదే స్ఫూర్తి దాముని తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనే జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా..జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహించే ప్రతి పోటీలకు అండదండగా ఉంటానని ప్రతి ఏటా అథ్లెటిక్స్ పోటీలు రాష్ట్ర అసోసియేషన్ ఆదేశాల మేరకు 12 పర్యాలు కొన్ని కొన్ని విభాగాలకు క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి పోటీలకు నిర్వహణలో సహకరిస్తున్న వారందరినీ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల లో హనుమకొండ జరిగిన పురుషులు మరియు మహిళ విభాగంలో పాల్గొని 4వ సీనియర్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్లో పోటీలలో మెడల్స్ సాధించిన వారిని డిసిపి కమిషనర్ సన్మానించారు.డాక్టర్ కొంకొండ ప్రభు అథ్లెటిక్స్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులువు అని తెలిపారు అథ్లెటిక్స్ అన్ని క్రీడాలకు వెన్నుముకగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు పీడీలు శ్రీనివాస్ సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు టెనికైట్ అసోసియేషన్ అధ్యక్షులు కాటం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఖ్యాతం రాజకుమార్ రిటైర్డ్ పిడి కనకయ్య పిడి సుజాత పిటి సువర్ణ లత కే ఉప్పలయ్య వెంకట నరసయ్య ప్రేమ్ కుమార్ రంగనాథ్ కనకారెడ్డి రామేశ్వర్ రెడ్డి కృష్ణ కుమార్ భాస్కర్ గౌడ్ నిశాంక్ గౌడ్ కళ్యాణి ఆనంద్ తదితరులు ఈ పోటీలో నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడారాణిలు 300 వందల మంది ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొన్నారు విజేతలకు సర్టిఫికెట్స్ తోపాటు మెడల్స్ ప్రధానం చేస్తామని మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను క్రీడారానిలను 22 & 23 తేదీల్లో హనుమకొండ లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Attachments area