గెలుపు లక్ష్యంగా పనిచేయాలి: బివి
హైదరాబాద్,సెప్టెంబర్17(జనంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయాలని జనగామ జిల్లా కార్యకర్తలతో ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ ముఖ్యనాయకులు కొందరు ఆయనను కలసినప్పుడు పార్టీ గెలుపుపై సూచనలు చేవారు. సీఎం కేసీఆర్ అదేశాలమెరకు ఈనెల 25లోపు యువ ఒటర్లను నమోదుచేయించాలని కోరారు. అదేవిధంగా ఓటర్లజాబితాలో తప్పు ఒప్పులను సరిదిద్దాలని దీనిలో గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. అదేవిధంగా బూత్‌లెవల్‌లో ఐదుగురుని నియమించుకోవాలని సూచించారు. పదవీకాలంలో చేసిన పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లి గెలిపిస్తాయని ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. పార్టీలో స్వార్థం లేకుండా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయని అన్నారు.