గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని
ఏలూరు,అక్టోబర్19(ఆర్‌ఎన్‌ఎ): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరులో శుక్రవారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పితానితో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలావుంటే కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జవహర్ పాల్గొన్నారు.