గ్రామాలలో ముమ్మరంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులు
టేకులపల్లి, అక్టోబర్ ( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు శుక్రవారం ముమ్మరంగా డ్రై డే సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కొప్పురాయి, కోయగూడెం ,బద్దుతండ, టేకులపల్లి గ్రామపంచాయతీ లలోని గ్రామాలలో ముమ్మరంగా బ్లీచింగ్ చల్లించారు. ఆరోగ్య ఆశ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నీటి నిల్వలను లేకుండా అవగాహన కల్పిస్తూ జ్వరం జలుబు లాంటి వారికి టాబ్లెట్లు పంపిణీ చేశారు. బద్దు తండ గ్రామపంచాయతీలోని మధిరాల తండాలో జ్వరాల బారిన పడుతున్నారని, కొందరికి చికెన్ గున్యా సోకినట్లు రిపోర్టులో వచ్చాయని, వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సర్పంచ్ కోరారు. కొన్ని గ్రామపంచాయతీలలో ప్రతి శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని రెండు, మూడు వారాలకు ఒకసారి బ్లీచింగ్లు చల్లుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాలు ముమ్మరంగా కురుస్తుండడంతో పల్లం ప్రాంతాలలో, సైడ్ కాలువలలో మురికి నీరు చేరుకొని దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలతున్నందున అధికారులు దృష్టి సారించి ప్రతి శుక్రవారం ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.