గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు

అధికారుల ప్రోద్బలంతో మారిన పరిస్థితి

కేవలం 22 రోజుల్లో 280 మరుగుదొడ్ల నిర్మాణం

బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా కన్నూర్‌ గ్రామం

వరంగల్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా లోని కమలాపూర్‌ మండలంలోని కన్నూర్‌ గ్రామంలో మూడువేల జనాభా ఉంది. ఈ గ్రామం మండలంలోనే అతి పెద్ద గ్రామపంచాయితి.. అయితే అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్న ఈ గ్రామంలో చాలామంది గ్రామస్తులు బహిర్భూమికి బయటకు వెళ్ళడమే కాని ఎవరి ఇంట్లోనూ మరుగు దొడ్లు ఉండేవి కాదు , అధికారులు వారికి మరుగుదొడ్ల నిర్మాణం అవశ్యకతను తెలిపిన ప్రజల్లో మార్పు రాలేదు. ఇక చేసిది లేక అధికారులు మొదటగా వారికీ రేషన్‌ సరుకులు ఆపివేశారు. చివరికి మరుగు దొడ్డి లేని నివాసంలోని యుక్తవయసు అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వం అని కూడా బోర్డులు వ్రాయించారు. గ్రామస్తుల్లో కొద్దిగా మార్పు వచ్చి మరుగుదొడ్లు నిర్మించుకుని… మలవిసర్జనకు మాత్రం బయటకు వెళ్ళడంతో ఇక అధికారులు చేసేది లేక వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జిల్లా డిఅర్దిఓ అధికారి నేతృత్వంలో ఉదయాన్నే ప్రజలు బహిర్భూమి కి బయటకు వెళ్ళే ప్రదేశానికి వెళ్లి వారికి డప్పు చప్పుళ్ళతో గ్రామానికి తీసుకెళ్ళడంతో పాటు అక్కడే వారికి బహిరంగా మలవిసర్జన ద్వారా వచ్చే సమస్యలను చెప్పడంతో ఆ గ్రామ ప్రజల్లో మార్పు వచ్చింది.. తమకు సరియిన నివాసం లేకున్నా పర్వాలేదు తమ అభిమానాన్ని కాపాడే మరుగుదొడ్డి ఉండాలి అది వినియోగం లోకి తీసుకుని బహిరంగా మలవిసర్జన మాని వేయాలని … సంకల్పించిన ప్రజలకు జిల్లా డిఅర్డిఓ రాము సహకారం తోడైంది.. అధికారులు గ్రామానికి కదిలారు. గ్రామంలో ప్రతి చోట మరుగు దొడ్డి లేకుంటే వచ్చే సమస్యలను … వాటి అవసరాలను తెలిసేలా రంగు రంగుల పెయింట్లు వేయించారు. కేవలం మూడు రోజులలో మరుగు దొడ్లు లేని 280 నివాసాలలో 280 దొడ్లకు వాస్తు ప్రకారం మార్కింగి చేసారు. కేవలం 22 రోజుల్లో 280 మరుగుదొడ్లను నిర్మించుకుని జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. జిల్లాలోనే మొదటి ఓడిఎఫ్‌ గ్రామంగా ప్రకటించుకుని కలెక్టర్‌ చేతుల విూదుగా పదిలక్షల ప్రోత్సాహకాన్ని గ్రామ ప్రజలు అందుకున్ననారు. ఈ గ్రామంలో ఎవరిని అడిగినా మరుగుదొడ్డి లేక తాము పడ్డ బాధలు చెపుతూ అధికారులు సహకారంతో తమ నివాసాలు గుడిసెలు ఐన పర్వాలేదు తమ అభిమాన్ని కాపాడేందుకు మరుగుదొడ్డి ఉందని రాత్రి పగలు మలవిసర్జనకు బయటకు వెళితే అనేక సమస్యలు వచ్చేవని ఇప్పుడు ఆరుబయట మరుగుదొడ్డి ఉండడంతో తాము ఆరోగ్యంగా ఉన్నామని గ్రామస్తులు తెలిపారు.