గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): నెల 6న అసెంబ్లీ రద్దు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటన తరవాత గ్రామాల్లో గులాబీ ప్రచారంజోరుందుకుంది. ఎక్కడిక్కడ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. అభ్యర్థులు తమ నియో జకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అభ్యర్థులకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే వేలాదిగా గులాబీ దళంలో చేరారు. నియోజకవర్గాల్లో చేరికల కార్యక్రమం జోరు కొనసాగుతోంది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పుకొడుతూ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గడిచిన పక్షం రోజుల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఇప్పటికే అనేకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికితోడు టిఆర్‌ఎస్ నేతల అభ్యర్థితత్వానికి మద్దతు ప్రకటిస్తూ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనుతున్నారు. ఊళ్లకు ఊళ్లే మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సవిూక్షలు నిర్వహిస్తూ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపి స్తామని తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు.