గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కు కృషి రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 29 జనం సాక్షి :
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, దేవరకొండ, దామరచర్ల,అడవి దేవులపల్లి మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు,శంఖు స్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కొండమల్లేపల్లి లో జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, ఎస్.పి.అపూర్వ రావు, దేవరకొండ శాసన సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్, ట్రై కార్ చైర్మన్ రాంచంద్ర నాయక్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ లు పుష్ప గుచ్చం అంద చేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కొండమల్లేపల్లి మండలం లో కేశ్యా తండా గ్రామం లో కేశ్యా తండా నాంపల్లి పిడబ్ల్యుడి రోడ్డు వయా కొత్త బావి,హంక్య తండా వరకు 3 కోట్ల 20 లక్షల రూ.ల వ్యయం తో నిర్మించనున్న బి.టి.రోడ్డు కు రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంఖు స్థాపన చేశారు అనంతరం పన్ని తండా,గుర్రపు తండా గ్రామం లో సాగర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి పన్ని తండా వరకు కోటి 50 లక్షల వ్యయం తో నిర్మించనున్న బి.టి.రోడ్డు పనులకు ఆమె శంఖు స్థాపన చేశారు అనంతరం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని గన్యా నాయక్ తండా పరిధిలో 4.20 లక్షలతో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు అనంతరం సుమారు 500.00 లక్షల అంచనా వ్యయంతో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాల అదనపు భవనం శంకుస్థాపన మరియు సుమారు 270.00 లక్షల అంచనా వ్యయంతో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలకు నివాస వసతి గృహమునకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమం లో అర్.డి.ఓ శ్రీరాములు, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి రాజ్ కుమార్,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణ వేణి, తహసీల్దార్ దివ్యా రెడ్డి, ఎంపీడీవో బాలరాజు రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నేనావత్ రాంబాబు నాయక్, రమావత్ దస్రు నాయక్, టీవీఎన్ రెడ్డి, కేసాని లింగారెడ్డి, పసునూరి యుగేందర్ రెడ్డి, ఎం ఇంద్రావతి, రాణి రాజు, జగన్ నాయక్, రాములు నాయక్, అనిత రాములు నాయక్, లలిత భీమ్ సింగ్, మేకల శ్రీనివాస్ యాదవ్, శ్రీను నాయక్, తులసిరామ్ కబీర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు