గ్రామీణ యువతను ప్రోచహించడమే ప్రభుత్వ లాక్షంగా గ్రామీణ క్రీడా మైదానాలు

ప్రతి రోజు క్రీడలు అడడం వల శారీరక దృఢత్వం తో పాటు మానసికంగా ఉల్లాసానికి దోహద పడుతుంది అని మొయినాబాద్ మండల ఎంపీపీ నక్షత్రం జయంత్ జెడ్పీటీసీ కలే శ్రీకాంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన గ్రామీణ క్రీడా మైదానాలను గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డి గూడ లో సర్పంచ్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ క్రీడా మైదానాలు వారు నాగిరెడ్డి గూడ గ్రామ పంచాయతీ పరిధిలో మొయినాబాద్ ఎంపిడిఓ తో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం పలువురితో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ అడరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ,గ్రామీణ యువకుల ఆరోగ్య వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం కేసీఆర్ గ్రామీణ క్రీడా మైదానాలు ప్రారంభించాలనే ఆదేశాల మేరకు ప్రతి గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ స్వప్న గ్రామ ఎస్సీ కమిటీ అధ్యక్షుడు బంటు విష్ణు , మనోజ్ కుమార్, ప్రేమ్ రాజు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.