గ్రామ అభివృద్ధికి పది లక్షల సహాయం
దాతను అభినందించిన గువ్వల బాలరాజు
జనం సాక్షి, వంగూరు:
మండల పరిధిలోని గాజర గ్రామాభివృద్ధికి చేయుతనివ్వాలని గ్రామానికి చెందిన వెనెపల్లి కార్తీక్ రావు అభ్యర్థన మేరకు హైదరాబాద్ కు చెందిన సివెంట్ కెమిస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోపౌండర్ అండ్ ఎండి చిట్టినేని శ్రీనివాసరావు గ్రామ అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి కొరకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాసరావును ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శాలువాతో సన్మానించి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య యాదవ్, గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.