ఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతిఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతి

 రామకృష్ణపూర్, (జనంసాక్షి) : ఏఐటీయూసీ యూనియన్ నిర్మాత కామ్రేడ్ దేవూరి శేషగిరి రావు గారి 75 వ వర్ధంతి ని పురస్కరించుకుని బుధవారం ఆర్కేపీ1ఏ గనిపై ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మిక సోదరులు  ఘనంగా  వర్థంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్నిన ఉద్దేశించి ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి సురమళ్ళ వినయ్ కుమార్ మాట్లాడుతూ  కామ్రేడ్ శేషగిరి రావు కార్మికుల కోసం అహర్నిశలు కష్టపడి అనేక హక్కులు సాధింది, చివరికి కొందరు బ్రిటిష్ గుండాల చేతిలో హత్య కాబడ్డారని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శేషగిరి రావు  ఏఐటీయూసీ యూనియన్ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించి, సింగరేణి కార్మికుల కోసం అనేక హక్కులు సాధించి చివరకు కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసారని  పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా మారడానికి శేషగిరి రావు గారు ఎంతగానో కృషి చేశారని అన్నారు. శేషగిరి రావు గారి లాంటి ఎందరో మహానుభావులు ఏఐటీయూసీ యూనియన్ లో చేరి సింగరేణి కార్మికుల కోసం పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేశారని,కావున అలాంటి మహనీయుల బాటలో సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం యువ కార్మికులు ముందుండాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోవిందుల రమేష్, ఫిట్ కమిటీ సభ్యులు సుంకరి గట్టయ్య, చెంద్రకాని రమేష్, మారం రాజు,  ఏఐటీయూసీ కార్యకర్తలు రామక్రిష్ణ, కైత రాయమల్లు, రామ్మోహన్, కొంక మహేష్, శ్రీకాంత్,  అక్కల సతీష్, శివ, ఆరీఫ్, రాజేష్ కిరణ్,  భైరం రాజయ్య, లక్ష్మీనారాయణ,, జక్కం మల్లేష్, సాయి కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.