ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు.

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు.

చిన్నంబావి మండల కేంద్రంలోని పెద్ద మారు గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మండలాల వ్యవహారాల ఇంచార్జ్, పెద్దమారు గ్రామ సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. మహాత్మాగాంధీ గారు శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాదించారు వారిని ఆదర్శంగా తీసుకొని శాంతిమార్గంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సాదించారు. భారతదేశంలో మొట్టమొదటి బారిస్టార్ చదివిన విద్యావేత్త మహాత్మాగాంధీ వారి చివరి శ్వాసవరకు దేశంకోసం శ్రమించి తన ప్రాణాన్ని కూడా దేశానికే ధారపోశారని వారి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ ను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామసభలో గ్రామానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామ పరిశుభ్రత పచ్చదనం, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలని లేనిచో విష జ్వరాల బారిన పడాల్సి వస్తుందని అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బిసన్న, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు