ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేడుకలు

నల్లబెల్లి సెప్టెంబర్ 02 ( జనం సాక్షి):
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కరెంటు కోతలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటును అందజేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కే  దక్కుతుందన్నారు. వైయస్ హయాంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లతో ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరిందని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన పిఎసిఎస్ సీఈవోగా పనిచేస్తున్న నాగేల్లి మొగిలి తల్లి మృతి చెందగా మృతదేహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏడాకుల సంపత్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు కుటుంబ రఘుపతి, ప్రధాన కార్యదర్శి నల్లగొండ సుధాకర్ , ఉపాధ్యక్షులు గొటుకుల రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ ఎరుకల రవీందర్, మాజీ ఎంపీటీసీ ఇస్తారు శేఖర్, జెట్టి రామ్మూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, మండల నాయకులు వంగర వెంకన్న, పులి రవీందర్, ప్రభాకర్, కోలా లింగయ్య, సంపత్ పాల్గొన్నారు.