ఘనంగా పూర్వ విద్యార్ధుల సమ్మేళనం.
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.గత కాలం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నూతన ఉషోదయానికి స్వాగతం పలకడానికి,నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
2003-2004 లోపదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు.గత కాలపు జ్ణాపకాల ఒడిలో ఒదిగి ఆనాడు నేర్చుకున్న విద్యాబుద్ధులు తమ జీవితాలను సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాయని,జీవిత కలలను సాకారం చేసుకోవడానికి సాధనంగా ఉపయోగపడ్డాయి.రక్త బంధం కంటే మించినది, బంధుత్వం కన్నా బలమైనది,కుల,మత, వర్గాల ను లెక్కకట్టనది స్నేహం అని మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.ఆపదలో చిక్కుకున్న వారికి ఎల్లప్పుడూ ఆపన్నహస్తాన్ని అందివ్వడానికి సిద్దంగా ఉన్నాము అని ప్రతిన బూనారు. ఆర్ధిక హోదా కంటే మనుషుల హ్రదయంలో గూడు కట్టుకోవడం వెల కట్టలేనిదని మమతానురాగాలు మదిలో చెరగని గుర్తులని అనుకున్నారు.తమ ఆత్మీయ మిత్రుల కలయిక భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ఉండాలని, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి ఘనంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోట్ల భాస్కర్ రెడ్డి,తుమ్మలపల్లి లక్ష్మారెడ్డి, గొబ్బూరి శ్రీనివాస్,మారినేని విజయకుమార్, బియ్యాల వెంకట నరసయ్య, అనంత వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.