ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు..
దౌల్తాబాద్ సెప్టెంబర్ 17, జనం సాక్షి: దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి గ్రామ అధ్యక్షుడు మార్కంటి నర్సింలు ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు,కస్తూర్బా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోతరాజు కిషన్,బీజేపీ నాయకులు సిలివెరి స్వామి, ఆంజనేయులు, మొద్దు రాజు, కర్రోల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.