ఘనంగా మహంకాళి అమ్మ ముత్యాలమ్మ బోనాలు

ఘనంగా మహంకాళి అమ్మ ముత్యాలమ్మ బోనాలు          తూప్రాన్( జనం సాక్షి )జూన్    :: ఉజ్జయిని మహంకాళి అమ్మ ముత్యాలమ్మ తల్లి మనోహరాబాద్ మండల ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థించినట్లు రాష్ట్ర సర్పంచుల పూర్వం వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి పేర్కొన్నారు మనోహరబాద్ మండల కేంద్రము లో ఆదివారం  రోజు తెలంగాణ సర్పంచుల పొరమ్ అధ్యక్షుడు సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఉజ్జయిని మహంకాళి పోషామ్మ ముత్యాలమ్మ లకు బోనాలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో మండల శాలివాహన  సంఘం అధ్యక్షుడు టంగుటూరిదశరథ,రజక సంఘం అధ్యక్షుడు రవి కుమార్  వార్డ్ సభ్యులు,తెరాస నాయకులు కుమ్మరి మల్లేష్,శంకర్, బిక్షపతి,నర్సింలు,వెంకటేష్,బాలకృష్ణ స్వామి రెడ్డి శేకర్ నర్శరెడ్డి,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు డప్పు చప్పులతో భారీ ఊరేగింపుతో ర్యాలీగా నిర్వహించి అమ్మ వాళ్లకు సమర్పించారు