ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

విశాఖపట్టణం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  విశాఖపట్టణంలో దసరా నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి.
వివిధ అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నింటికి మించి శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని ఆదివారం బంగారం, కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రూ. 2 కోట్ల విలువ చేసే 8 కేజీల బంగారం, రూ.2.5 కోట్ల కరెన్సీతో అమ్మవారిని అలంకరించినట్లు దేవాలయ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. అమ్మవారిని కరెన్సీతో అలంకరించి పూజలు చేయడం వల్ల.. వ్యాపారంలో మంచి లాభాలు, భవిష్యత్‌లో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం ఒక్కరోజే 50 వేల మంది భక్తులు వచ్చారు.

తాజావార్తలు