ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు


చొప్పదండి, ఆగస్టు 18 (జనం సాక్షి):సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను చొప్పదండి గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమండ్ల గంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మైన్ గుర్రం నీరజ హాజరై పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ ,గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల గంగయ్య గౌడ్ లు మాట్లాడుతూ ఆగస్టు 18, 1650 నాడు నేటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించిన సర్వాయి పాపన్న చిన్నతనం నుండే అప్పటి పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి వారిని ఓడించి గోల్కొండ కోటపై తెలంగాణ జెండా ఎగురవేసిన మొట్ట మొదటి ధీరుడు తెలంగాణ ఛత్రపతి శివాజీ సర్దార్ పాపన్న అని కొనియాడారు. చొప్పదండి మున్సిపాలిటీ సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఏదైనా ఒకచోట సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని గౌడ కులస్తులు మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజను కోరగా వారు విగ్రహ ఏర్పాటు కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు చేపూరి సత్యనారాయణ, ముద్దం తిరుపతి, బొడిగే హన్మంతు, బొడిగే నందయ్య, బుర్ర మల్లిఖార్జున్, జాగిరి లింగయ్య, బూరుగు కుమారస్వామి, పెరుమాండ్ల వెంకటరాములు, బత్తిని ప్రశాంత్, పూదరి మధు, పుదరి లస్మయ్య, బొడిగే గంగరాజు, కోటగిరి ప్రశాంత్, బొమ్మగాని రంజిత్, చేపూరి రామస్వామి, శ్రీనివాస్, నారాయణ, సాయి బొడిగె శేఖర్, పౌడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.