ఘనంగా సీతారాముల కళ్యాణం


మెట్పల్లి, మార్చి 30, జనంసాక్షి :
మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, పండుగగా చూడ ముచ్చటగా, ఘనంగా జరిగింది. ఆనవాయితిగా గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి పుస్తె మట్టెలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ కమిటీ, గ్రామ కమిటీ పెద్దలు సర్పంచ్ లకు అందించారు ఈ కళ్యాణ మహోత్సవం పురోహితులు శ్రీమాన్ చక్రపాణి మాధవాచారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు, ఇల్లెందుల శ్రీనివాస్, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు