ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.

– సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్.

బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి)
స్థానిక మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు బంజారాలు ఘనంగా నిర్వహించారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను అందించాలనే దృక్పథం తో వాటిని ముందు తరాలకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించామని సర్పంచ్ భూక్య భారతి అన్నారు. మండల పరిధిలోని అంజనాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుదవారం బంజారాలు (లంబాడీలు) యువకులు, ఉద్యోగులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి భోగ్ బండారు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు బంజారా వక్తలు మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ ఆరేళ్ల బాలుడుగా ఉన్నప్పుడే వారసత్వంగా వస్తూ ఉన్న పశువులను పోషణను వృత్తిగా స్వీకరించారని లంబాడీలను తరతరాలుగా గుర్తు ఉండే విధంగా మేరామ తల్లిని ఎదిరించి తన సాధన కొరకై గిరిజనులకు ఆదర్శంగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య సీతారాములు నాయక్, భూక్య నరసింహ నాయక్, బానోత్ హుస్సేన్ నాయక్, భూక్య సేవాలాల్ నాయక్, భూక్య వెంకట్ నాయక్, బానోత్ శ్రీనివాస్ నాయక్, తేజావత్ అంజిత్ కుమార్, తేజావత్ రాజగోపాల్, తేజావత్ విద్యాసాగర్, భూక్య వంశీరాథోడ్, యాదవ్ గాంధీ మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.