చంద్రబాబును దెబ్బతీసేందుకే తెరపైకి ఐఎంజీ వ్యవహరం:టీడీపీ
హైదరాబాద్: ఐఎంజీ భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశాక ఇప్పుడు పిల్ వేయడంఏంటని తెదెపా నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును దెబ్బతీసెందుకు ఐఎంజీ భూముల వ్యవహరం మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. విజయసాయిరెడ్డితో ఏబీకే ప్రసాద్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు.విజయసాయి తరపున ఏబీకే ప్రయాణం చేయాల్సిన అవసరమేంటని అడిగారు.