చంద్రబాబు తీరుతోనే..  ఏపీ ప్రజలకు కష్టాలు

– ఓటమి భయంతోనే ఢిల్లీలో దొంగ దీక్షలు
– వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాలతో, ఆయన స్వలాభాల కోసం ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  ప్రత్యేక ప్యాకేజీకి
సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం వల్లే ఆంధప్రదేశ్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా ¬దాపై చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ఓటమి భయంతోనే ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బును సిగ్గు లేకుండా పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు.  తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పోరాటాలతోనే ప్రత్యేక ¬దా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందని పేర్కొన్నారు. నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య విమర్శలు ఉంటున్నాయే గానీ విచారణ మాత్రం జరగడం లేదని సజ్జల అన్నారు. ప్రధాని మోదీ- చంద్రబాబు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. పోలవరం అంశం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి వెళ్లినా ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఇలా జరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రత్యేక ¬దా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక ¬దా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దొంగదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నిలకు ముందు ఓట్ల కోసమే బాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత డబ్బునో, పార్టీ డబ్బునో కాకుండా ప్రజాధనాన్ని దొంగ దీక్షలకు ఉపయోగించడమేమిటని ప్రశ్నించారు. నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకొంటున్న చంద్రబాబు.. నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన పథకాలు కాపీ కొట్టడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సర్వేల పేరిట వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను భయాందోళనకు గురిచేసి, ప్రలోభపెట్టే కార్యక్రమంలో చంద్రబాబు మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు చేష్టలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సరియైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.