చంద్రబాబు బినావిూ సిఎం రమేశ్
ఐటి దాడులపై అందుకే ఉలిక్కిపాటు: వైకాపా
కడప,అక్టోబర్22(జనంసాక్షి): సిఎం రమేశ్ ఇంటిపై ఐటి దాడులు ఇప్పుడు కడపలో చర్చనీయాంశంగా మారాయి. రమేశ్ వ్యవహారంతో టిడిపి ఉలిక్కి పడుతోందని సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బినావిూలు కటకటాలపాలుగాక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ
జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు హెచ్చరించారు. ఏం జరిగినా దాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి మాట్లాడటం టీడీపీ వారికి ఫ్యాషనైపోయిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతుంటే జగన్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పద
మన్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రికి బినావిూలు చాలా మంది ఉన్నారని, వారందరిపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2014కు ముందు రూ.50కోట్ల
పనులు మాత్రమే చేసే రిత్విక్ కంపెనీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో రూ.3,550కోట్ల పనులు చేయడం ఆశ్చర్యకరమన్నారు. అత్యవసరం కింద 61సీ జీఓ తెచ్చి ప్రాజెక్టుల పనులన్నీ అంచనాలు పెంచి నామినేషన్‌పై చేశారన్నారు. జిల్లాలో గండికోట, అవుకు టన్నెల్, జీఎన్‌ఎస్‌ఎస్, ఆర్‌టీపీపీలో
పనులన్నీ రిత్విక్ సంస్థే చేస్తోందన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి చేస్తున్న పనుల్లో ముఖ్యమంత్రికి 25 శాతం వాటా ఉందని ఆరోపించారు. సుజనా చౌదరి వేలకోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఇన్ని అక్రమాలు చేసి ప్రభుత్వానికి ఆదాయపన్ను ఎగ్గొట్టిన వీరంతా ఏనాటికైనా
కటకటలపాలు కాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు దీక్ష చేసినందుకే తనపై ఐటీ దాడులు చేశారని సీఎం రమేష్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసింది ఉక్కు దీక్ష కాదని, అది వంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందని, అందుకే టీడీపీ వారు ఎన్ని
అక్రమాలు చేస్తున్నా ఏవిూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఐటీ దాడులతో ఏం సాధిస్తారో వేచిచూడాలని అన్నారు. గత తొమ్మిదేళ్ల పాలన తర్వాత దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని తెహల్కా డాట్ కామ్ తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా
గుర్తు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి, మంత్రి పదవులను పంచుకున్న టీడీపీ ఇప్పుడు ఐటీ దాడులు జరిగేసరికి ఇతరులపై బురద జల్లడం సరికాదన్నారు. సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే వైఎస్ జగన్‌పై బురదజల్లడం సరికాదన్నారు.