చంద్రబాబు లక్ష్యంగా బిజెపి దూకుడు
మరో కోణంలో చాపకిందనీరులా విపక్షాలు
ఎపిలో మారనున్న రాజకీయ సవిూకరణాలు
అమరావతి,అక్టోబర్19(జనంసాక్షి): ఎపిలో ఇప్పుడు చంద్రబాబును ఎలా ఓడించాలా అనే విషయంపై అన్ని పార్టీలు రాజకీయంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నా అందరి లక్ష్యం మాత్రం చంద్రబాబు అన్నట్టుగా ఉంటోంది. గతంలో ఎప్పుడూ లేనంతంగా బిజెపి నేరుగా విమర్శలకుదిగుతోంది. ఐటి దాడులతో బాబును ఉక్కిరిబిక్కిరి చేయిస్తోంది. ఈ దశలోఎ చందం/-రబాబు కూడా కేంద్రం లక్ష్యంగా విమర్శలకు పదుపు పెట్టారు. వీలు చికకినప్పుడాల్లా కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వైకాపా రాజకీయ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు ఎన్‌డిఎ నుంచి బయటకు రావడం, బిజెపితో వైరం పెంచుకోవడంతో తనకుతానుగా శతృవులను పెంచుకున్నారు. ఇంతకాలం వైకాపా మాత్రమే శతృపక్షంలో ఉండేది. ఇప్పుడు జగన్, జనసేన, బిజెపితో ఆపటు లెఫ్ట్ పార్టీలు కూడా చేరాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒకవైపు మిగతా వారంతా ఒకవైపు అన్న రీతిలో ఎపి పాలిటిక్స్ సాగుతున్నాయి. ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి, పోలవరం ఇలా అనేక విసయాల్లో బాబు చేసిన తప్పిదాల కారణంగా రాజకయీంగా చంద్రబాబుకు అందరూ శత్రువులుగా మారుతున్నారు. బిజెపిని బాబు దూరం చేసుకున్నందున బిజెపి కూడా ఇక ఎపిలో పాగా వేయడమెలా అన్న రీతిలో ముందుకు సాగుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి పెద్దలు పావులు కదపడం మొదలుపెట్టారు. ప్రత్యేక¬దా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో నరేంద్ర మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయనను టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితులలోనూ చంద్రబాబు మళ్లీ గెలవకుండా బిజెపి పావులు కదుపుతోంది. జివిఎల్ నరసింహారావు,రాంమాధవ్ వంటి వారు ఈ విషయంలో చురుకుగా
పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిపై తీవ్రాతితీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీ అన్నాక అధికారంలోకి రావడమే లక్ష్యం కనుక బిజెపి కూడా గట్టిగానే ముందుకు సాగుతోంది. మరోవైపు ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. దీనికి తోడు తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో నరసింహులు లాంటి వారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ద్వేషంతో బయటకు వచ్చారు. దీంతో చంద్రబాబునాయుడు శత్రువులకు మరో ఆయుధం దొరికినట్టయ్యింది. వైకాపాను అధికారంలోకి తీసుకుని వచ్చే క్రమంలో విజయసాయి రెడ్డి కూడా బాగానే కృషి చేస్తున్నారు. చంద్రబాబు వ్యతిరేకులను ఏకం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని బాబు వైఫల్యాలను చేరవేస్తున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ రాజకీయా లలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అటు ఢిల్లీ పెద్దలకు తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ, ఇటు తెలుగుదేశం నాయకులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నారు.ప్రత్యేక ¬దా అంశంపై భారతీయ జనతాపార్టీతో విభేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని లోపాలను సేకరించే పనిలో బీజేపీ పెద్దలు తలమునకలైంది. బీజేపీ నాయకులు చంద్రబాబును బలహీనపర్చడానికై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి సహకరిస్తున్నారని టిడిపి వారు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్న రాజకయీ ప్రత్యర్థుల వ్యూహాలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వచ్చే ఎన్నికలు మాత్రం చంద్రబాబుకు అంత ఈజీ కావని అర్థం అవుతున్నాయి. నాడు మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ ఇప్పుడు టీడీపీకి ప్రత్యర్థులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.