చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది పుప్పాల లింబాద్రి
మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17,
జనంసాక్షి :
చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ, మరియు బహిరంగ సభ పోస్టర్ల ను మెట్పల్లి పట్టణంలో ఆవిష్కరించిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామంలో భారత రిజర్వేషన్ల పితామహుడు బహుజన చక్రవర్తి చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు, బహిరంగ సభకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు ఇట్టి బహిరంగ సభకు బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీ వర్గాలు మరియు అగ్రవర్ణ పేద మధ్యతరగతి ప్రజలు, రైతులు మహిళలు యువకులు విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని లింబాద్రి విజ్ఞప్తి చేశారు ఛత్రపతి సాహు మహారాజు ప్రభుత్వం 26జూలై 1902 రోజున భారతీయ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది టీచర్ ట్రైనింగ్ స్కూల్ లను పెట్టించాడు ఈకార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్ ప్రభాకర్, కళ్యాణ్ సురాజ్ భీమన్న అమర్ శేఖర్ అరుణ్ జయంత్ నరసయ్య అజయ్ తదితరులు పాల్గొన్నారు