చాకలి అయిలమ్మ పేరు సాంసృతిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో స్థానం కల్పించటం హర్షణీయం :
: బిఆర్ఎస్ఎస్
మోత్కూరు జూలై 21 జనంసాక్షి : తెలంగాణ సాయుధపోరాటంలో రజాకార్ల పై చాకలి ఐలమ్మ ఎదురొడ్డి పోరాట పటిమ”ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తమ సాంసృతిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో స్థానం కల్పించటం పట్ల బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం నాడు శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ భూమి,భుక్తి కోసం జరిగిన పోరాటంలో 60 గ్రామాల భూ స్వామిని ఐలమ్మ ఎదిరించి పోరాటం చేయడంతో ఆమె పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్య గిరి, పట్టణ బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు నల్ల సతీష్, శెట్టి వేణు, అలకుంట్ల రాజేష్ తదితరులు ఉన్నారు.