చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు 24న ఇంటర్వ్యూ

తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు అక్టోబరు 24వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.  టిటిడిలో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన  పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు అక్టోబరు 24వ తేదీన వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ జరుగనుంది. మొత్తం 3 పోస్టులున్నాయి.తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో ఉదయం 10.30 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరగు అభ్యర్థులు 18 నుండి 34 సంవత్సరాల వయుస్సు కలిగి, తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌తో పాటు, జిరాక్స్‌, రెండు ఫోటోలు తీసుకురావాలి.