చింతమనేనికి వ్యతిరేకంగా ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌23 (జ‌నంసాక్షి): అఖిలపక్షం-దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు జూట్‌మిల్లు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. దళితుడు, హమాలీ కార్మికుడు రాచీటి జాన్‌పై దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించిన దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే పిడిఎస్‌యు ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరుతూ..ఉపాధ్యాయులంతా ప్లకార్డులతో, ఫ్టెక్సీ బ్యానర్లతో నిరసన తెలుపుతూ.. డిమాండ్‌ చేశారు.